29వ లేజర్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం
హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఈటెల
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సాగరతీరంలో 29వ జాతీయ లేజర్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్‌తో పాటు సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబక్‌కు చెందిన పలువురు సైనికాధికారులు హాజరయ్యారు. హుస్సేన్ సాగర్‌ను పరిశుభ్రంగా మార్చడం ద్వారా క్రీడలతో పాటు పర్యాటకరంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఈటెల వెల్లడించారు.