44కు చేరిన కార్చిచ్చు మృతుల సంఖ్య
వాషింగ్టన్,నవంబర్13(జనంసాక్షి): కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 44కు చేరింది. గురువారం చెలరేగిన ఈ కార్చిచ్చులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మృతదేహాలను అధికారులు వెలికి తీస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు మొబైల్ డీఎన్‌ఏ ల్యాబ్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 8వేల మంది పాల్గొంటున్నారు. 6,700 భవనాల వరకు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదం ధాటికి సుమారు లక్ష ఎకరాల అడవి అగ్నికి ఆహుతైంది. ఒక్క వెంచురాకౌంటీ ప్రాంతంలోనే దాదాపు 15వేల ఎకరాల మేర అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. బలమైన గాలులతో కార్చిచ్చు మరింత వ్యాపించింది. ఒక ఊరు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. పరిస్థితి చక్కబడటానికి సుమారు మూడు వారాలు పట్టవచ్చంటున్నారు అధికారులు.