4 రోజుల సమయం కావాలని కోరిన అక్బరుద్ధీన్
హైదరాబాద్: వివాదాస్పద వాఖ్యలు చేసినందుకు పలు కేసులను ఎదుర్కోంటున్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తన తరుపున హాజరయ్యేందుకు నిర్మల్ పోలీసుస్టేషన్‌కు ఇద్దరు న్యాయవాదులను పంపారు. ఆరోగ్య కారణాల రీత్యాపోలీసుల ముందు హాజరయ్యేందుకు 4 రోజుల సమయం ఇవ్వాలని న్యాయవాదుల ద్వారా విజ్నప్తి చేయించారు. విచారణకు పోలీసులు నిర్ణయించిన తేదీలో హాజరవుతానని అభ్యర్థించారు.