4 వేలు పెరిగిన పసిడి ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): శ్రావణ శుక్రవారం నాడు మహిళలకు బంగారం షాకిచ్చింది.  ఈ వారంలో రూ. 4 వేల రూపాయల ధర పెరిగిన బంగారం ఈ రోజు ఒక్కసారిగా రూ. 1500 పెరిగింది. బంగారం ధర ఈ రోజు దాదాపుగా రూ. 32 వేలకు చేరింది. రూ.  3 వేలు పెరిగి వెండి కిలో ధర రూ. 50 వేలు దాటింది.