44వ జాతీయ రహదారిలో డివైడర్‌ను ఢీకొన్న కారు

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం కొత్తపేట వద్ద ఈరోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బెంగుళూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న కారు 44వ జాతీయ రహదారిలో డివైడర్‌ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రకాశం జిల్లా నుంచి వెళ్లి హైదరాబాద్‌లో స్థిరపడిన రాజశేఖర్‌ (45), ఒంగోలు నుంచి వెళ్లి చెన్నైలో స్థిరపడిన మహ్మద్‌ రఫి (40) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.