45 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు
బి. కొత్తకోట: చిత్తూరు జిల్లా బి. కొత్తకోట మండలం చలిమామిడి గ్రామానికి చెందిన 45 మంది కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి ఓ విందు కార్యక్రమంలో భోజనం చేసిన తర్వాత పలువురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం బి. కొత్తకోట ఆసుపత్రికి తరలించారు. వీరులో కొందరిని మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ఆసుపత్రిలో చేర్చారు.