45 లక్షల 99 వేలు లడ్డు వేలం పలికింది

 అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 10

అల్వాల్ పట్టణ కేంద్రంలోని డైరీ ఫార్మ్ రోడ్ కనజిగూడ మరకత శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి నవరాత్రులు విభిన్నమైన అలంకార రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ నవరాత్రులు అంగరంగ వైభవంగా భక్తులకు అభిషేకాలు నిర్వహించారు. ఆఖరి రోజు లడ్డు వేలం పాట లో 45 లక్షల 99 వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలకు గీత ప్రియ వెంకటరావు దంపతులు కైవసం చేసుకున్నారు. పోయిన సంవత్సరం కూడా వారికే దక్కడం జరిగింది. ఆ దేవుని కటాక్షం వల్ల ఉన్నత స్థాయిలో ఉన్నామని శ్రీవారి కృపకు తోడుగా ఈ లడ్డును కైవసం చేసుకుందామని వెంకటరావు దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఆలయ నిర్వాకులు పాల్గొన్నారు. ఈ డబ్బుతో అన్న ప్రసాద వితరణకు ఆలయ అభివృద్ధికి ఆలయము కావలసిన స్థల సేకరణకు వినియోగిస్తామని ఆలయ నిర్వాహకులు మోత్కూరి సత్యనారాయణ శాస్త్రి తెలిపారు.

Attachments area