50 పడకల ఆస్పత్రిగా కోటగిరి సీ.హెచ్.సీ 50 పడకల ఆస్పత్రిగా కోటగిరి సీ.హెచ్.సీ
కోటగిరి ఫిబ్రవరి 24 జనం సాక్షి:-బాన్సువాడ నియోజక వర్గం కోటగిరి మండలంలోని ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 30 పడకల కోటగిరి కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంను 50 పడకల ఏరియా ఆస్పత్రిగా మారుస్తూ శుక్రవారం జీవో ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఏరియా ఆసుపత్రి నిర్మాణానికై ప్రభుత్వం 13 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొంది.కోటగి రి ఏరియా ఆసుపత్రిగా ఏర్పాటుకు కృషి చేసిన స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కి మండల ప్రజానీకం కృతజ్ఞతలు తెలుపుతూ హార్షం వ్యక్తం చేస్తున్నారు.