51వ సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

` నేడు బాధ్యతల స్వీకరణ
` ముగిసిన జస్టిస్‌ చంద్రచూడ్‌ పదవీకాలం..
న్యూఢల్లీి(జనంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ పదవీకాలం నేటితో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో (ూబీజూతీవఎవ అనీబీతీబి) అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా..51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతి భవన్‌ ఇందుకు వేదిక కానుంది. ఎన్నికల బాండ్లు, ఆర్టికల్‌ 370 రద్దు వంటి చరిత్రాత్మక తీర్పులు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా కీలక భూమిక పోషించారు. దిల్లీలోని ప్రముఖ కుటుంబానికి చెందిన జస్టిస్‌ ఖన్నా.. దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దేవ్‌రాజ్‌ ఖన్నా కుమారుడు. దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌.ఆర్‌.ఖన్నా సవిూప బంధువు. 1960 మే 14న జన్మించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. దిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్యను అభ్యసించారు. నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (ఔంఒూం)కు ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. దిల్లీ బార్‌ కౌన్సిల్‌లో 1983లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న జస్టిస్‌ ఖన్నా.. తొలిరోజుల్లో తీస్‌హజారీ కాంప్లెక్సులోని జిల్లా కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు.
ఆదాయపన్ను శాఖ సీనియర్‌ స్టాండిరగ్‌ కౌన్సిల్‌గా సుదీర్ఘకాలం కొనసాగారు. 2004లో దిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ టెర్రిటరీ స్టాండిరగ్‌ కౌన్సిల్‌ (సివిల్‌)గా నియమితులయ్యారు. 2005లో దిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు అందుకున్నారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నవంబర్‌ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న జస్టిస్‌ ఖన్నా.. 2025 మే 13 వరకు ఆ పదవిలో కొనసాగుతారు. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమంటూ ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పులో జస్టిస్‌ ఖన్నా కూడా ఒకరు. కేంద్ర ప్రభుత్వం 370వ రాజ్యాంగ అధికరణం రద్దు చేయడాన్ని జస్టిస్‌ ఖన్నా సమర్థించారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లు సురక్షితమైనవని, బోగస్‌ ఓట్ల నిర్మూలనలో కీలక పాత్ర పోషించాయని జస్టిస్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం గతంలో తీర్పు వెలువరించింది. లోక్‌సభ ఎన్నికల వేళ దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు జస్టిస్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తొలిసారి మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. పెండిరగ్‌ కేసులు తగ్గించడం, సాధ్యమైనంత త్వరగా తీర్పులు ఇస్తారని పేరుంది.