కిషన్‌బాగ్ ఘటన..మృతుల కుటుంబానికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా
హైదరాబాద్, మే 15 : హైదరాబాద్‌లోని కిషన్‌బాగ్ ఘటనపై గవర్నర్ నరసింహన్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. ఘటన పూర్వపరాలపై గురువారం నాడు రాజ్‌భవన్‌లో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. ఆరు లక్షలు,..అలాగే గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ.50 వేలు వంతున చెల్లించడంతో పాటు వారికి మెరుగైన చికిత్సను ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. ప్రజలంతా ఎలాంటి ఉద్రిక్తతలకు గురి కాకుండా సంయమనం పాటించాలని..ప్రశాంత వాతావారణానికి అందరూ సహకరించాలని కోరారు.