తెలంగాణ 60 ఏళ్ల సుధీర్ఘ పోరాటం: నారాయణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ పోరాటం 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. టీజేఎఫ్‌ నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక భాష మాట్లాడే వాళ్లు ఒకే రాష్ట్రంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారు. తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. 1990 లోనే తెలంగాణ కోసం ఉద్యమించాలని పార్టీ జిల్లాల కమిటీ సమావేశాల్లో నిర్ణయం జరిగిందని తెలిపారు. పార్టీలు నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిమాండ్‌ చేశారు. అన్ని పార్టీల అభిప్రాయాలు, భాగస్వామ్య పక్షాలతో మాట్లాడిన తర్వాతే తెలంగాణ కేంద్రం నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో లొల్లి పెట్టడం తగదు అని అన్నారు.