కేంద్ర మంత్రి గోపినాథ్‌ముండే(64) మృతి

న్యూఢిల్లీ, జూన్ 3 : కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే(64) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉదయం కారులో ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే గోపినాథ్‌ను ఎయిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఉదయం 7:20 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు బీజేపీ కార్యాలయానికి ముండే మృతదేహాన్ని తరలించనున్నారు. రేపు(గురువారం) గోపినాథ్ ముండే అంత్యక్రియలు జరుగనున్నాయి.