సర్పంచ్ పదవికి వేలం: కేసు నమోదు
వరంగల్,(జంనసాక్షి): జిల్లాలోని చెన్నారావుపేట మండలం అక్కలచేడు గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు. గ్రామానికి చెందిన లలిత రూ. 5 లక్షలకు పదవిని కైవసం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న నర్సంపేట సీఐ మధు, చెన్నారావుపేట ఎస్సై జైపాల్‌రెడ్డి. తహశీల్దార్ శ్రీనివాసరావులు వేలంపాటలో పాల్గొని పది మందిపై కేసు నమోదు చేశాడు. వారి వద్ద నుంచి పోలీసులు రూ. 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.