డ్యాన్స్‌ బార్‌లపై సంపూర్ణ నిషేధం: మహారాష్ట్ర ఆలోచన

ముంబయి: డ్యాన్స్‌బార్‌లలో నృత్యం చేయడం ద్వారా ఉపాధి పొందడానికి సుప్రీంకోర్టు బార్‌ గర్ల్స్‌కి అనుమతినిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఆలోచనలో పడింది. త్రీస్టార్‌, అంతకన్నా ఎక్కువ స్థాయి హోటల్స్‌ వరకే ఇప్పటివరకు డ్యాన్స్‌ గర్ల్స్‌కి అనుమతి ఉండేది. సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మొత్తంగా డ్యాన్స్‌బార్స్‌ మీదే సంపూర్ణ నిషేధం విధించే ఆలోచన చేస్తోంది మహారాష్ట్ర సర్కారు. ఈ దిశగా ఆ రాష్ట్ర హోంశాఖ అర్డినెస్స్‌ తెచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది.