ఎల్లుండి సమావేశం కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ కోర్ కమిటీ ఎల్లుండి సమావేశం కానుంది. తెలంగాణ వర్కింగ్ కమిటీ భేటీ తేదీలను కోర్ కమిటీ ఖరారు చేయనుంది. ఈ నెలాఖరున లేదా ఆగష్టు మొదటి వారంలో సీడబ్య్లూసీ సమావేశం జరగనుంది. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తినలో మకాం వేశారు.