అదుపుతప్పి పోలాల్లోకి దూసుకెళ్లిన ఆరీస్టీ బస్సు
ఉప్పునుంతల: మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పరపల్లి నుంచి అచ్చంపేటకు 120 మంది ప్రయాణికులతో వెళ్తున్న అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదం నుంచి ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. బస్సు కమాన్‌పట్టి విరగడంతో ప్రమాదం జరిగిందని డ్రైవర్ కాజా తెలిపారు. బస్సులో పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. ప్రమాదం జరిగినందని తెలిసిన వెంటనే ఉప్పరపల్లి ్గగ్రామస్థులు సంఘటనాస్థలానికి భారీగా తరలివచ్చారు.