రేపు ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు హాజరుకానున్న అనిల్ అంబానీ
ఢిల్లీ: రిలయన్స్ అడాగ్ ఛైర్మన్ అనిల్ అంబానీ 2జీ కేసులో రేపు ప్రత్యేక సీబీఐ కోర్టు ముందు ప్రాసిక్యూషన్ సాక్షిగా హాజరుకానున్నారు. ట్రయల్ కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లిన రిలయన్స్ టెలికాం లిమిటెడ్ దరఖాస్తును సుప్రీంకోర్టు గురువారం అత్యవసరంగా విచారించడానికి నిరాకరించింది. న్యాయస్థానం ఈ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దాంతో అనిల్ అంబానీ హాజరు తప్పనిసరి కానుంది.