ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్థులు
కడప: జిల్లాలోని పుల్లంపేట మండలంలోని టి. కమ్మపల్లి, టి. బలిజపల్లెలో 9,10 వార్డులకు సంబంధించిన ఖాళీ బ్యాలెట్ బ్యాక్సుల్లో గ్రామస్థులు నీళ్లు పోశారు. గ్రామస్థులు పోలింగ్‌ను బహిష్కరించినప్పటికీ అధికారులు పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో ఆగ్రహించి బ్యాలెట్ బాక్సులో నీళ్లు పోశారు. ఎగువపల్లెకు చెందిన నాయకులు తమను గ్రామంలోకి రానీయడం లేదని ఆరోపిస్తూ రెండు గ్రామాలకు చెందిన 500 మంది ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు.