హైకమాండ్‌ నిర్ణయానికి కట్టుబడతాం: కావూరి సాంబశివరావు

ఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు చెప్పాల్సింది చెప్పామని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ఏ నిర్ణయం తీసుకున్న హైకమాండ్‌ నిర్ణయంకు కట్టుబడి ఉంటామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేక నిర్ణయం తీసుకోరని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.