సీమాంధ్రలో భారీ బందోబస్తు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్రలోని ప్రధాన పట్టణాల్లో పోలీసులను భారీగా మోహరించారు. కర్నూలు, కడప, విజయవాడ, విశాఖ పట్టణాల్లో పోలీసులు మార్చ్‌ నిర్వహించారు. ఆంధ్రా యూనివర్సిటీలో పోలీసులు మోహరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులపై సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆదేశాలు  జారీ చేశారు.