సీఎల్పీలో సీమాంధ్ర నేతల భేటీ
హైదరాబాద్,(జనంసాక్షి): అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీలో సీమంధ్ర కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. సమావేశానికి మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇప్పటికే ఢిల్లీకి చేరిన సీమాంధ్ర నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.