ముగిసిన మూడో దశ పంచాయతీ ఎన్నికలు
హైదరాబాద్: రాష్ట్రంలో ఇవాళ జరుగుతున్న మూడో దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ మేరకు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా కొన్ని చోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతుందని వాను అన్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసేందుకు వచ్చిన వారినందరిని ఓటు వేసేందుకు అనుమతించామని, వాళ్లు ఓటు వేసేందుకు క్యూలో ఉన్నారని పేర్కోన్నారు. కాసేపట్లో ఓట్లు లెక్కింపు ప్రారంభం కానుందని అన్నారు. మొదటగా వార్డు మెంబర్లు లెక్కింపు, తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.