వరద ఉద్ధృతి కారణంగా నిలిచిపోయిన రాకపోకలు
తూర్పుగోదావరి: జిల్లాలోని దేవిపట్నం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. వరద ఉద్ధృతి కారణంగా ఇప్పటికే 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దేవిపట్నంలోని జాలర్‌పేట, ఎస్సీకాలనీ, పోచమ్మగండి వద్ద 10 ఇళ్లు నీటమునిగాయి.