కె.టి. దొడ్డి గ్రామంలో ట్రాక్టర్‌ బోల్తా: ముగ్గురి మృతి

గట్టు: మహబూబ్‌నగర్‌ జిల్లా గట్టు మండలం కె.టి.దొడ్డి గ్రామంలో ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు రైతులు అక్కడికక్కడే మృతిచెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ధరూర్‌ మండలం గువ్వలదిన్నె గ్రామస్థులుగా గుర్తించారు.