ఆనాథపిల్లల ఆశ్రమంలో విద్యుత్ షార్ట్‌సర్య్కూట్‌తో బాలుడి మృతి
విశాఖ (వేపగుంట): జీవీఎంసీ 57వ వార్డు నర్వలో గల ఆరాధన హోం అనాథపిల్ల ఆశ్రమంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ జరిగింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మరో ముగ్గురు చిన్నారులకు గాయాలవ్వడంతో నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.