గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో యువకుని దారుణ హత్య

చేగుంట : మెదక్‌ జిల్లా చేగుంట మండలం చెట్లతిమ్మాయపల్లి వెనకతండాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మన్య (35) అనే వ్యక్తిని ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి చంపారు. ఘటనాస్థలిని రామాయంపేట సీఐ గంగాధర్‌, చేగుంట ఎస్సై వినాయకరెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.