పీసీసీ చీఫ్‌ బొత్సతో తెలంగాణ నేతల భేటీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌, ఎంపీ పొన్నం ప్రభాకర్‌, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై వారు చర్చించనున్నట్లు సమాచారం.