తెలంగాణ ఉద్యోగులపై దాడికి నిరసన వ్యక్తం చేసిన టీ జేఏసీ
వరంగల్,(జనంసాక్షి): సీమాంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వోద్యోగులపై దాడిని తెలంగాణ జేఏసీ జిల్లా విభగం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులపై దాడులు చేస్తే ఇక్కడ తీవ్ర పరిణామాలుంటాయని జేఏసీ నేతలు హెచ్చరించారు. ఈ మేరకు ఇవాళ హన్మకొండలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాన ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో జేఏసీ ఛైర్మన్ సుబ్బారావు, టీ ఎన్టీవోల జిల్లా అధ్యక్షుడు రాజేష్‌కుమార్, జగన్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.