వీహెచ్‌పై దాడిసరియైందికాదు:సోమిరెడ్డి
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావుపై తిరుపతిలో జరిగిన దాడిని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక ప్రాంతం నేతపై అలా దాడి చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర ఉద్యమకారులు ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఆందోళనలు చేయాలని కోరారు. అలాంటప్పుడు ఉద్యమ ఫలితం దక్కుతుందని అన్నారు.