నిజాంపేటలో బీభత్సవం సృష్టించిన దోపిడీ దొంగలు
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని నిజాంపేటలో దోపిడీ దొంగల బీభత్సవం సృష్టించింది. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి 70 వేల రూపాయలు దోచుకెళ్లారు. దీంతో యువకుడి శరీరంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. పోలీసులు అతన్ని నిమ్స్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.