పాటియాల కోర్టు వద్ద ఉగ్రవాది తుండాపై దాడి
న్యూఢిల్లీ,(జనంసాక్షి): పాటియాల హౌజ్ వద్ద లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండాపై దాడి జరిగింది. ఇవాళ కోర్టు ఆవరణలో తుండాపై నలుగురు వ్యక్తులు దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉగ్రవాది తుండాను పది రోజులు పోలీసు కస్టడీకీ ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.