ఏపీఎన్టీవోలపై హైకోర్టు సీరియస్
హైదరాబాద్,(జనంసాక్షి): చట్ట విరుద్దంగా సమ్మె చేస్తున్నారంటూ ఏపీఎన్టీవోపై హైకోర్టు సీరియస్ అయింది. రవికుమార్ అనే న్యాయవాది ఏపీఎన్టీవోల సమ్మె రాజ్యంగ విరుద్దమని హైకోర్టులో వేసిన పిటీషన్‌పై హైకోర్టు ఈ విధంగా స్పందించింది. ఏపీఎన్టీవోలు ప్రభుత్వ ఉద్యోగులా, ప్రైవేటు ఉద్యోగులా అని ఎన్టీవోలను ప్రశ్నించింది. ఎపీఎన్టీవోలు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని హైకోర్టు తెలిపింది. విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయడానికి ఏపీ ఎన్టీవోలు గడువు కోరారు. కోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.