సినీ పాత్రికేయుడు బాబురావు కన్నుమూత

హైదరాబాద్‌ : ప్రముఖ సినీ పాత్రికేయుడు లడగపాటి బాబురావు బుధవారం కన్నుముశారు. ఆయన కొంత కాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. యూసఫ్‌గూడలోని నివాసంలో ఈరోజు బాబురావు మృతి చెందారు. ఆయన వందకు పైగా సినిమాలకు, పలువురు హీరోయిన్లకు పీఆర్‌వోగా పనిచేశారు. బాబురావు అంత్యక్రియలు గురువారం హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. సినీ హీరో నాని ట్విట్టర్‌ లో బాబురావు మృతి పట్ల సంతాపం తెలిపాడు.