ఇందిరాపార్క్‌ వద్ద టీ జేఏసీ శాంతి దీక్ష

హైదరాబాద్‌,(జనంసాక్షి): పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలని సీమాంధ్రులు విధ్వేషాలు వీడి రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ రాజకీయ జేఏసీ ఇందిరాపార్క్‌ వద్ద శాంతి దీక్ష చేపట్టింది. దీక్షలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూర్చున్నారు. దీక్షను టీఆర్‌ఎస్‌ పొటిట్‌బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కడియం శ్రీహరి  ప్రారంభించారు. కార్యక్రమానికి తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం, ఉద్యోగ జేఏసీ నాయకులు దేవిప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌, విఠల్‌, రఘు, తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.