తెలంగాణ బిల్లు కోసం నేడు శాంతి ర్యాలీలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఈ రోజు జిల్లా కేంద్రాల్లో శాంతి ర్యాలీలు నిర్వహించాలని పీఆర్టీయూ నిర్ణయించింది. ఈ రోజు సాయంత్రం 4గంటలకు పీఆర్టీయూ భవనం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు వేలాది మంది ఉపాధ్యాయులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సరోత్తండ్డి ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు జాతి రెండు రాష్ట్రలుగా విడిపోయి అభివృధ్ది సాధించేందుకు సీమాంధ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.