తులసిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీ న్యాయవాదులు
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్న 20 సూత్రాల అమలు పథకం కమిటీ ఛైర్మన్ తులసిరెడ్డిపై టీ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జలసౌధలో తెలంగాణ ఉద్యోగులపై దాడి చేయించేందుకు ప్రయత్నించిన తులసిరెడ్డిపై నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. తులసిరెడ్డికి వ్యతిరేకంగా టీ ఉద్యోగులు నినాదాలు చేశారు.