తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల మహాధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అధికారిపై దాడికి నిరసనగా తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. అధికారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌సౌధలోని తెలంగాణ ఉద్యోగులు తమ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన తెలంగాణనేతలను లోనికి అనుమతించడం లేదు. కనీసం మీడియానైనా అనుమతించాలని ఉద్యోగులు పోలీసులను కోరారు. దీనికి పోలీసులు తిరస్కరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.