హైదరాబాద్ ముమ్మాటికీ తెలంగాణ ప్రజల హక్కు :జూపల్లి
హైదరాబాద్,(జనంసాక్షి): ముమ్మాటికీ హైదరాబాద్ తెలంగాణ ప్రజల హక్కు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ కోసం శాంతి ర్యాలీ తీస్తే టీఆర్‌ఎస్ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్, స్వామిగౌడ్ బాల్కసుమన్ అరెస్టు చేయడం దారుణమన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు చేసేందుకు జగన్ దీక్ష చేస్తున్నాడని జూపల్లి ఆరోపించారు.