సీఎం కిరణ్‌ సీమాంధ్ర జేఏసీ ఛైర్మన్‌ : హరీష్‌రావు

హైదరాబాద్‌,(జనంసాక్షి): సీమాంధ్ర జేఏసీ చైర్మన్‌గా సీఎం కిరణ్‌కుమార్‌డ్డి, కన్వీనర్‌ డీజీపీ దినేష్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపించారు. ఢిల్లీ బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణను అడ్డుకోవాలని సీమాంధ్ర మంత్రులు ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా తెలంగాణలోని పరిస్థితులను అధిష్ఠానం తెలుసుకోవాలని ఆయన సూచించారు.