రాజీనామాలతో తెలంగాణ ఆగదు : గండ్ర వెంకటరమణ
హైదరాబాద్,(జనంసాక్షి): సీమాంధ్ర మంత్రుల రాజీనామాలపై ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా స్పందించారు. రాజీనామాలు, ఒత్తిల్లతో తెలంగాణ ఆగదు అని తేల్చిచెప్పారు. చంద్రబాబు ప్రాంతానికో మాట, పూటకో మాట్లాడటం సరికాదన్నారు. ఏదైనా ఒక నిర్ణయానికి కట్టుబడి ఉంటే మంచిది అని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం మంత్రులు గంటా, ఏరాసు తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.