ఏపిఎన్జీవోల సభ ఆంధ్ర ఆధిపత్య సభ : టీఆర్‌ఎస్‌ నేత శ్రవణ్‌

హైదరాబాద్‌: నిన్న ఎల్జీస్టేడియంలో జరిగింది సమైక్యసభ కాదు.. ఆంధ్రా ఆధిపత్య సభ అని టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్‌ శ్రవణ్‌ ఎపీఎన్జీవోల సభపై ధ్వజమెత్తారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.ఆత్మీయత పేరుతో ఏపీ ఎన్జీవోలు వైషమ్యాలు రెచ్చగొట్టారని మండిపడ్డారు.జైతెలంగాణ నినాదాలు చేస్తే చితక్కొడతారా అని ప్రశ్నించారు.ఏపీ ఎన్జీవోల దాష్టికంపై డీజీపీ దినేష్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని అడిగారు.సమైక్యవాదం పేరుతో ఏపీ ఎన్జీవోలు శాడిజం ప్రదర్శించారని కోపోద్రిక్తులయ్యారు.