విధ్యార్థులపై పోలీసుల దాడి తగదు : రాపోలు

హైదరాబాద్‌ ఏపీఎన్జీవోల సభ నేపధ్యంలో నిజాం కళాశాల విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్‌ తీవ్రంగా ఖండించారు.పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థులను నిజాం హాస్టల్‌లో ఆదివారం రాపోలు పరామర్శించి వివరాలు అడిగితెలుసుకున్నారు. సీమాంధ్ర ఉద్యోగులు, విద్యార్థులు ఎంత రెచ్చగొట్టిన నిజాం హాస్టల్‌ విద్యార్థులు సంయమనం పాటించి శాంతియుతంగా నిరసన తెలిపారన్నారు. అయినప్పటికి పోలీసులు లాఠీ చార్జ్‌ చేయడం ఎంత వరకు సబబని రాపోలు ప్రశ్నించారు.