లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 257 పాయింట్లు లాభపడి దాదాపు రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఊహించిన దానికన్నా జీడీపీ గణాంకాలు సానుకూలంగా ఉండడంతో మార్కెట్ సెంటిమెంట్‌కు బలం చేకూర్చాయి. ఓ దశలో 20,819 బెంచ్ మార్క్‌ను తాకిన సెన్సెక్స్ చివరకు 257 పాయింట్లు లాభపడి 20,791 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, పీఎన్‌యూ, మూలధన వస్తువుల షేర్లను మదుపర్లు అధికమొత్తంలో కొనుగోలు చేశారు. ఐటీసీ, ఐసీఐసీఐ, ఎన్‌బీఐ షేర్లు కూడా మార్కెట్ లాభపడటంలో కీలక పాత్ర పోషించాయి. అటు జాతీయ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ కూడా 84,25 పాయింట్లు లాభపడి 6,176,10 వద్ద ముగిసింది.