సచివాలయం ముట్టడికి యత్నించిన విద్యార్థి జేఏసీ
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధులు సచివాలయం ముట్టడికి యత్నించారు. కొందరు విద్యార్థులు సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని రాష్ట్రాన్ని విభజించవద్దంటూ నినాదాలు చేశారు. పోలలీసులు వీరిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ ఆడారి కిషోర్ బాబు తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.