ఏడో విడత భూపంపిణీని ప్రారంభించిన సీఎం
హైదరాబాద్: హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏగో విడత భూపంపిణీని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…రైతుకు భూమి హక్కు ఇస్తే సుస్థిరత సాధ్యమవుతుందన్నారు. పేదల భూములక నీటి వసతి ఉల్పించేందుకు రూ. 1800 కోట్లతో ఇందిరా క్రాంతి పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్ కోసం రూ. 30 వేల కోట్ల రాయితీ ఇచ్చినట్లు సీఎం చెప్పారు. గోదావరి నుంచి 5వేల టీఎంసీలు, కృష్ణా నది నుంచి 500 టీఎంసీల నీరు వృథాగా పోతోందని, సముద్రంలో వృథాగా పోయే నీటిని వినియోగించుకుంటే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు.