పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి: ఎర్రబెల్లి
హైదరాబాద్: పార్లమెంటులో తెలంగాణ బిల్లును త్వరలో పెట్టాలని తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఏ ఒక్క పార్టీ వల్లో తెలంగాణ రాలేదని, విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం మృతి చెందిన వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వం ఆదుకోవాలని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. వారు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. ఆరు ప్రాంతాలకు కేంద్రం న్యాయం చేయాలని, తెలంగాణను అబివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్లాలని మోత్కుపల్లి అన్నారు.