ఎంఎంటీఎస్ రైళ్లలో జీఎం తనిఖీలు
హైదరాబాద్: రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను మరింత పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె. శ్రీవాత్సవ తెలిపారు. భద్రతా సిబ్బందిని పెంచడం సహా నిఘాను పటిష్ఠపరుస్తామని వెల్లడించారు. రాజధానిలో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ రైలులో ప్రయానించి రైలులో భద్రత సహా అందుతున్న సౌకర్యాలను ప్రయాణీకులను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ఎంఎంటీఎస్ రైళ్లలో ఏర్పాటు చేసిన భద్రతా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణీకులకు సరిపడా ఎంఎంటీఎస్ రైళ్లను పెంచలేకపోతున్నట్లు తెలిపిన జీఎం రద్దీ వేలల్లో బోగీల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.