న్యూజిలాండ్ లో పెరుగుతున్న భారతీయులు
ఇంటర్‌నెట్‌డెస్క్, హైదరాబాద్: న్యూజిలాండ్‌లో భారతీయుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇటీవల విడుదలైన జనాభా లెక్కల ప్రకారం దేశంలో భారతీయుల జనాభా 155,000లకు చేరింది. ఇది గతంలో కంటే 48 శాతం పెరిగిందని ఆ దేశ వర్గాలు తెలిపాయి. చైనా దేశస్తులు 171,000 ఉండగా, ఫిలిప్సిన్స్ దేశస్థులు 40,000 మంది ఉన్నట్లు పేర్కొన్నాయి. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో 4.24 మిలియన్ల జనాభా ఉన్నట్లు పేర్కొన్నాయి.