ఆంధ్రప్రదేశ్ అవినీతి కేంద్రంగా మారిపోయింది: జేపీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవినీతి కేంద్రంగా మారిపోయిందని లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ అన్నారు. లోక్‌పాబ్ బిల్లు వచ్చిందని సంబరపడాల్సిన అవసరం లేదు. లోక్‌పాల్ బిల్లుతో మన బతుకులు బాగుపడవని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జేపీ మాట్లాడుతూ… రాష్ట్రాన్ని అధికారులు, నేతలు కలిసి దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రేషన్‌షాపు డీలర్‌షిప్‌కు రూ. 3లక్షలు తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. 17 ఏళ్లుగా విజిలెన్స్ నివేదికను శాసనసభలో ప్రవేశ పెట్టలేదని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు.