శాసన మండలి రేపటికి వాయిదా

హైదరాబాద్‌: విభజన బిల్లుపై ఎటాంటి చర్చ జరగకుండానే శాసన మండలి రేపటికి వాయిదా పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం చేయాలని సీమాంధ్ర తెదేపా, వైకాపా ఎమ్మెల్సీలు, తెలంగాణ బిల్లుపై చర్చించాలని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో ఛైర్మన్‌ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేశారు. వాయాద అనంతరం సభ ప్రారంభమైన తర్వాత కూడా ఇదే గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్‌ సభను రేపటికి వాయిదా వేశారు.